Rohit Sharma Century: India Captain Rohit Sharma smashesh Hundred after 17 Months, Rohit Sharma equals Ricky Ponting ODI hundreds record

Photo of author

By Admin

IND vs NZ, Rohit Sharma smashesh Hundred after 17 Months: టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ సెంచరీ నిరీక్షణకు తెరపడింది. ఇండోర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో మెరుపు శతకం బాదాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్.. 83 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. హిట్‌మ్యాన్‌ 9 ఫోర్లు, 6 సిక్సులతో 101 పరుగులు చేశాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా 2020 జనవరి 19న ఆస్ట్రేలియాపై రోహిత్ చివరిసారిగా మూడంకెల స్కోరు చేశాడు. ఇప్పుడు సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ సెంచరీ చేశాడు.

రోహిత్‌ శర్మ అన్ని ఫార్మట్లలో కలిపి 42 సెంచరీలు బాదాడు. వన్డేల్లో 30 సెంచరీలు బాధగా.. టెస్ట్‌లో 8, టీ20లో 4 శతకాలు చేశాడు. తాజా శతకంలో వన్డేల్లో అత్యధిక సెంచరీల సాధించిన బ్యాటర్లలో రోహిత్‌ మూడో స్థానానికి చేరాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ (30)తో కలిసి సమంగా నిలిచాడు. రోహిత్ సెంచరీ బాదడంతో అతడి ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శతక మార్క్ అందుకోగానే.. మైదానం మొత్తం అభిమానుల ఈలలు, కేకలతో మార్మోగిపోయింది. 

మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి వన్డేలో డబుల్‌ సెంచరీతో అదరగొట్టిన గిల్‌.. మూడో వన్డేలోనూ సెంచరీ (112) బాదాడు. కేవలం 72 బంతుల్లోనే 13 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో సెంచరీ చేశాడు. దాంతో తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ( 21 ఇన్నింగ్స్‌ల్లోనే నాలుగు సెంచరీలు) నాలుగు వన్డే శతకాలు బాదిన ఐదో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు భారత్‌ నుంచి తొలి ఆటగాడిగా నిలిచాడు. పాకిస్తాన్ బ్యాటర్ ఇమామ్‌ ఉల్ హక్‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. కేవలం 9 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్‌ను సాధించాడు.

Also Read: iPhone 14 Pro Max Price: రూ. 20 వేలకే ఐఫోన్‌ 14 ప్రో మాక్స్.. బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ లేకుండానే!  

Also Read: IND vs NZ 3rd ODI: టీమిండియాదే బ్యాటింగ్‌.. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఔట్! తుది జట్టులోకి ఉమ్రాన్‌, చహల్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook

 

Leave a Comment