IND vs NZ 3rd ODI : మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను ఇప్పటికే సొంతం చేసుకున్న భారత్ (India).. న్యూజిలాండ్ (New Zealand)తో ఆఖరి వన్డేకు సిద్దమైంది. ఇండోర్ వేదికగా జరిగే మూడో వన్డేలోనూ నెగ్గి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో టీమిండియా (Team India) ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లేథమ్ (Tom Latham) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం కివీస్ ఒక మార్పు చేసింది. అదే సమయంలో భారత్ రెండు మార్పులు చేసింది. సూపర్ ఫామ్ లో ఉన్న మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీలకు విశ్రాంతి ఇచ్చింది. వీరి స్థానాల్లో ఉమ్రాన్ మాలిక్, యుజువేంద్ర చహల్ ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక కివీస్ షిప్లీ స్థానంలో డఫీని తీసుకుంది.
చహల్ కు అవకాశం
గత కొంత కాలంగా పెద్దగా రాణించలేకపోతున్న యుజువేంద్ర చహల్ కు ఈ మ్యాచ్ లో ఆడే అవకాశం దక్కింది. శ్రీలంకతో జరిగిన తొలి వన్డే అనంతరం చహల్ ను పక్కన పెట్టిన భారత్.. అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్ కు అవకాశం వచ్చింది. అక్కడి నుంచి కుల్దీప్ యాదవ్ అదరగొడుతూ జట్టులో ప్రధాన స్పిన్నర్ గా మారిపోయాడు. అయితే ఈ మ్యాచ్ లో సిరాజ్, షమీలకు విశ్రాంతి ఇచ్చిన టీమిండియా.. చహల్ కు అవకాశం ఇచ్చింది. దాంతో చాలా రోజుల తర్వాత కుల్చా ద్వయం బరిలోకి దిగనుంది.
ఇండోర్ లో ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ భారత్ గెలిచింది. రాయ్ పూర్ లా కాకుండా ఇండోర్ వికెట్ బ్యాటింగ్ పిచ్. ఈ క్రమంలో మూడో వన్డేలో భారీ స్కోర్లు నమోదయ్యే అవాకశం ఉంది. అయితే సిరాజ్, షమీలు లేకపోవడంతో భారత్ బౌలింగ్ కాస్త బలహీనంగా మారింది. ఉమ్రాన్ మాలిక్, శార్దుల్ ఠాకూర్ లతో పాటు హార్దిక్ పాండ్యా ఎలా బౌలింగ్ చేస్తారో చూడాలి.
అందరి కళ్లూ వారిద్దరిపైనే
శ్రీలంకపై రెండు సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ తో జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి వన్డేలో 8 పరుగులు చేసిన అతడు.. రెండో వన్డేలో 11 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ ను ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఆరంభాలు లభిస్తున్నా వాటిని భారీ ఇన్నింగ్స్ లు గా మార్చలేకపోతున్న కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బిగ్ ఇన్నింగ్స్ ఆడితే చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రెండో వన్డేలో అర్ధ సెంచరీ చేసిన రోహిత్.. ఈ మ్యాచ్ లో సెంచరీ చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. వీరితో పాటు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లు కూడా రాణిస్తే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం.
తుది జట్లు
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, చహల్, శార్దుల్ ఠాకూర్
న్యూజిలాండ్
టామ్ లాథమ్ (కెప్టెన్,) అలెన్, కాన్వే, నికోలస్, మిచెల్, ఫిలిప్స్, బ్రేస్ వెల్, సాన్ ట్నర్, ఫెర్గూసన్, టిక్నర్, డఫీ
First published:January 24, 2023, 13:11 IST
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ind vs Nz, Ind vs NZ ODI series, India vs newzealand, Mohammed Siraj, Rohit sharma, Surya Kumar Yadav, Team India, Virat kohli