ind-vs-nz : హెన్రీ నికోలస్‌ 42 ఔట్‌

Photo of author

By Admin

42 పరుగులు చేసిన హెన్రీ నికోలస్‌ కుల్‌దిప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 40 బంతులు ఆడిన హెన్రీ నికోలస్‌ 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో డివాన్‌ కాన్వే , డార్ల్‌ మిచెల్‌ ఉన్నారు.

  • 10 ఓవర్లు పూర్తి.. న్యూజిలాండ్‌ 73/1

10 ఓవర్లు పూర్తయ్యే సరికి న్యూజిలాండ్‌ ఒక వికెట్‌ నష్టానికి 73 పరుగులు చేసింది. హెన్రీ నికోలస్‌, డివాన్‌ కాన్వే దాటిగా ఆడుతున్నారు. హెన్రీ నికోలస్‌ 36, డివాన్‌ కాన్వే 36 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  • 6 ఓవర్లకు న్యూజిలాండ్‌ 36/1

6 ఓవర్లు పూర్తయ్యే సరికి స్యూజిలాండ్‌ ఆటగాళ్లు 36 పరగులు చేశారు. హెన్రీ నికోలస్‌, డివాన్‌ కాన్వే మరో వికెట్‌ పడకుండా నెమ్మదిగా ఆడుతూ.. స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్తున్నారు. హెన్రీ నికోలస్‌ 22, డివాన్‌ కాన్వే 12 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  •  ఫిన్‌ ఆలెన్‌ డక్‌ఔట్‌.. న్యూజిలాండ్‌ 5/1

385 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్‌ 2వ బంతికే న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ఫిన్‌ ఆలెన్‌ పాండ్యా బౌలింగ్‌లో డక్‌ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో హెన్రీ నికోలస్‌, డివాన్‌ కాన్వే ఉన్నారు.

 

  • భారత్‌ 385/9 .. కివీస్‌ ముందు భారీ స్కోరు

ఇండియా-న్యూజిలాండ్‌ మధ్య ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌) వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత ఓపెనర్లు రెచ్చిపోయారు. ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఇప్పటికే సిరీస్‌ నెగ్గిన ఊపు మీదున్న టీమిండియా నామమాత్రపు మూడో వన్డేలో కూడా రెచ్చిపోయింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (85 బంతుల్లో 101, 9 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (78 బంతుల్లో 112, 13 ఫోర్లు, 5 సిక్సర్లు) దాటిగా ఆడారు. మధ్య ఓవర్లలో కోహ్లీ 34, సూర్య 14, సుందర్‌ 9, శార్దుల్‌ 25, నిరాశపరిచిన చివర్లో హార్ధిక్‌ పాండ్యా రెచ్చిపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌.. 9 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో జాకబ్‌ డఫ్పీ 3, బ్లెయిర్‌ టిక్నర్‌ 3, మైకెల్‌ బ్రాస్‌వెల్‌ 1 వికెట్‌ తీసుకున్నారు.

  • పాండ్యా హాఫ్‌ సెంచరీ.. భారత్‌ 382/8

మూడో వన్డేలో హార్దిక్‌ పాండ్యా హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 38 బంతులో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు పూర్తి చేశాడు. ఆ వెంటనే జాకబ్‌ డఫ్పీ బౌలింగ్‌లో డివాన్‌ కాన్వేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రసుత్తం క్రీజులో కుల్‌దీప్‌ యాదవ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ ఉన్నారు.

  • శార్దుల్‌ ఔట్‌

17 బంతుల్లో 25 పరుగులు చేసిన శార్దుల్‌ బ్లెయిర్‌ టిక్నర్‌ బౌలింగ్‌లో డార్ల్‌ మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి కుల్‌దిప్‌ వచ్చాడు.

  • సుందర్‌ ఔట్‌

మూడో వన్డేలో వాషింగ్‌టన్‌ సుందర్‌ నిరాశపరిచాడు. 14 బంతుల్లో 9 పరుగులు చేసి బ్లెయిర్‌ టిక్నర్‌ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. క్రీజులోకి శార్ధుల్‌ వచ్చాడు.

  • సూర్య ఔట్‌..  భారత్‌ 295/5

14 పరుగులు చేసిన సూర్యకుమార్‌ జాకబ్‌ డఫ్పీ బౌలింగ్‌లో డివాన్‌ కాన్వేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో పాండ్యా, సుందర్‌ ఉన్నారు. భారత్‌ 39 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది.

  • విరాట్‌ ఔట్‌

దూకుడుగా ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విరాట్‌ కోహ్లీ 36 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. జాకబ్‌ డఫ్పీ బౌలింగ్‌లో ఫిన్‌ ఆలెన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 27 బంతులు ఆడిన కోహ్లీ 3 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 36 పరగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో పాండ్యా, సూర్య ఉన్నాడు.

 

  • ఇషాన్‌ రన్‌ ఔట్‌

మూడో వన్డేలో ఇషాన్‌ కిషాన్‌ రన్‌ఔట్‌గా పెవిలియన్‌ చేరాడు. 24 బంతులు ఆడిన కిషాన్‌ ఒక ఫోర్‌, ఒక సిక్స్‌ సాయంతో 17 పరగులు చేశాడు. క్రీజులో విరాట్‌, సూర్య ఉన్నారు.

  • శుభ్‌మాన్‌ ఔట్‌.. టీమ్‌ఇండియా 242/2

టీమ్‌ఇండియా ఓపెనర్‌ శుభ్‌మాన్‌ గిల్‌ 112 పరగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. బ్లెయిర్‌ టిక్నర్‌ బౌలింగ్‌లో డివాన్‌ కాన్వేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. గిల్‌ 78 బంతులో 13 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 112 పరగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ, ఇషాన్‌ కిషాన్‌ ఉన్నారు.

  • రోహిత్‌ ఔట్‌

టీమ్‌ఇండియా ఓపెనర్లు రోహిత్‌ శర్శ సెంచరీ చేయగానే ఔటయ్యాడు. మైకెల్‌ బ్రాస్‌వెల్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి విరాట్‌ కోహ్లీ వచ్చాడు. ప్రస్తుతానికి భారత్‌ 27 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 227 పరుగుల చేసింది. గిల్‌ 104 పరగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • రోహిత్‌, గిల్‌ సెంచరీ

టీమ్‌ఇండియా ఓపెనర్లు రోహిత్‌ శర్శ, శుభ్‌మాన్‌గిల్‌ మూడో వన్డేలో దూకుడుగా ఆడుతూ.. సెంచరీ నమోదు చేశారు. తొలుత రోహిత్‌ శర్శ 83 బంతుల్లో 9ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేయగా శుభ్‌మాన్‌గిల్‌ కేవలం 72 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతానికి భార్‌ స్కోరు 205 గా ఉంది. వికెట్‌ కోసం న్యూజిలాండ్‌ బౌలర్లు తీవ్రంగా కష్టపడుతున్నారు.

 

  • దూకుడుగా ఆడుతున్న రోహిత్‌, గిల్‌.. భారత్‌ 172/0

మూడో వన్డేలో టీమ్‌ఇండియా ఓపెనర్లు దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్‌ స్కోరు 172 పరగులుగా ఉంది. రోహిత్‌ శర్శ 64 బంతుల్లో 80 పరుగులు, గిల్‌ 56 బంతుల్లో 77 పరుగులమీద బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  • గిల్‌, రోహిత్‌ హాఫ్‌ సెంచరీ..  

3వ వన్డేలో శుభ్‌మాన్‌గిల్‌, రోహిత్‌ శర్శ హాఫ్‌ సెంచరీ చేశారు. 33 బంతుల్లోనే గిల్‌ 50 పరగులు పూర్తి చేశాడు. రోహిత్‌ 42 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. గిల్‌ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. రోహిత్‌ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

  • 10 ఓవర్లు పూర్తి.. భారత్‌ 82/0

10ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 82 పరుగులు చేసింది. రోహిత్‌ శర్శ 32, గిల్‌ 41 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు. వికెట్‌ తీయడానికి న్యూజిలాండ్‌ బ్యాటర్లు కష్టపడుతున్నారు.

 

  • టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌…

టీమిండియాతో జరుగుతున్న ఆఖరి వన్డేలో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. భారత జట్టు తొలుత బ్యాటింగ్‌ చేయనుంది. తొలి రెండు వన్డేల్లో ఘన విజయాలు అందుకున్న టీమిండియా ఇప్పటికే సిరీస్‌ని సొంతం చేసుకుంది. చివరి వన్డేలో గెలిచి క్లీన్‌స్వీప్‌తో పాటు , ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌ వన్డే టీమ్‌గా నిలవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఉమ్రాన్‌ మాలిక్‌, యజ్వేంద్ర చాహాల్‌తో బరిలోకి దిగుతోంది.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చాహాల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌

న్యూజిలాండ్‌ జట్టు: ఫిన్‌ ఆలెన్‌, డివాన్‌ కాన్వే, హెన్రీ నికోలస్‌, డార్ల్‌ మిచెల్‌, టామ్‌ లాథమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మైకెల్‌ బ్రాస్‌వెల్‌, మిచెల్‌ సాంట్నర్‌, లూకీ ఫర్గూసన్‌, జాకబ్‌ డఫ్పీ, బ్లెయిర్‌ టిక్నర్‌

Leave a Comment