ప్రపంచ క్రికెట్ భారత బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగుతోంది.బౌలర్లు ఎవరైనా మన బ్యాట్స్‌మెన్లు విధ్వంసకరంగా ఆడుతున్నారు.
ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు.తాజాగా వన్డే క్రికెట్‌లో మనవాళ్లు రికార్డులు సృష్టిస్తున్నారు.
భారత కొత్త యువ స్టార్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాడు.న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో హైదరాబాద్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించాడు.
టీమిండియా ఓపెనింగ్‌లో శుభమన్ గిల్ ఈ డబుల్ సెంచరీ సాధించాడు.ఓపెనర్‌గా వచ్చిన శుభమన్ గిల్ 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు.
ఇన్నింగ్స్ చివరి ఓవర్ అంటే 50వ ఓవర్లో హెన్రీ వేసిన బంతికి గిల్ ఔటయ్యాడు.అయితే అప్పటికే వరుసగా మూడు సిక్సర్లు కొట్టి పూర్తి చేసిన డబుల్ సెంచరీ చేశాడు.
గిల్ తన ఇన్నింగ్స్‌లో మొత్తం 9 సిక్సర్లు, 19 ఫోర్లు కొట్టాడు.ఈ ఇన్నింగ్స్‌తో వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
శుభ్‌మన్ గిల్ కంటే ముందు మరో నలుగురు భారత బ్యాట్స్‌మెన్ ఈ ఘనత సాధించారు.కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్‌పై భారత జట్టులోని మరో యువ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ సాధించాడు.శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లతో పాటు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ డబుల్ సెంచరీలు సాధించారు.2010లో సౌతాఫ్రికాపై తొలిసారి సచిన్ టెండూల్కర్ 200 నాటౌట్ స్కోరు సాధించాడు.2011లో వీరేంద్ర సెహ్వాగ్ వెస్డిండీస్‌పై 219 పరుగులు చేశాడు.
తర్వాత రోహిత్ శర్మ ఏకంగా మూడుసార్లు డబుల్ సెంచరీ సాధించాడు.తొలిసారి 2013లో ఆస్ట్రేలియాపై 209, ఆ తర్వాత 2014లో శ్రీలంకపై 264, 2017లో శ్రీలంకపైనే 208 నాటౌట్ స్కోర్లు సాధించాడు.ఇషాన్ కిషన్ 210 స్కోరును ఇటీవల బంగ్లాదేశ్ పై సాధించాడు.
తాజాగా శుభమన్ గిల్ 208 స్కోరును న్యూజిలాండ్ పై బాదేశాడు.ఇలా మొత్తం ఐదుగురు భారత క్రికెటర్లు వన్డేలలో డబుల్ సెంచరీ సాధించారు.
మరే దేశానికి సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నారు.