టాస్ గెలిచిన న్యూజిలాండ్… క్లీన్ స్వీప్ లక్ష్యంగా టీమిండియా…

Photo of author

By Admin

టీమిండియాతో జరుగుతున్న ఆఖరి వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి రెండు వన్డేల్లో ఘన విజయాలు అందుకున్న టీమిండియా ఇప్పటికే సిరీస్‌ని సొంతం చేసుకుంది..

మూడో వన్డేలో గెలిస్తే టీమిండియా, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ వన్డే టీమ్‌గా నిలుస్తుంది. ఈ సిరీస్ ఆరంభానికి ముందు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో ఉన్న న్యూజిలాండ్, ఆ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలంటే ఆఖరి వన్డేలో గెలిస్తే సరిపోతుంది..

తొలి వన్డేలో పోరాడి ఓడినా, రెండో వన్డేలో మాత్రం న్యూజిలాండ్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. భారత బౌలర్ల ముందు నిలవలేక 108 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో మూడో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు, భారత బౌలింగ్ విభాగాన్ని ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది…
 

మూడో వన్డేలో టీమిండియా రెండు మార్పులతో బరిలో దిగుతోంది. సీనియర్ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీతో పాటు టీమిండియా హైయెస్ట్ వికెట్ టేకర్ మహ్మద్ సిరాజ్‌కి నేటి మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించిన టీమిండియా, వీరి స్థానంలో ఉమ్రాన్ మాలిక్, యజ్వేంద్ర చాహాల్‌లకు అవకాశం కల్పించింది. 

విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి ఈ సిరీస్‌లో ఒక్క అదిరిపోయే ఇన్నింగ్స్ కూడా రాలేదు. తొలి రెండు వన్డేల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్‌లోకి వెళ్లాలని చూస్తున్న విరాట్ కోహ్లీ, నేటి మ్యాచ్‌లో ఓ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. రోహిత్ శర్మకు మంచి ఆరంభాలు దక్కుతున్నా, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో మాత్రం వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు..

శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ యాక్సిడెంట్‌కి గురి కావడంతో ఇషాన్ కిషన్ వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ ఇద్దరూ తమ ప్లేస్‌లను సుస్థిరం చేసుకోవాలంటే ఈ మ్యాచ్ ఆఖరి అవకాశం లాంటిది. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో వన్డే సిరీస్‌కి ఎంపికైన రజత్ పటిదార్, ఆఖరి వన్డేలో కూడా రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది…

ఇప్పటికే సిరీస్ ఫలితం తేలిపోవడంతో నామమాత్రంగా మారిన ఆఖరి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకుని రజత్ పటిదార్, షాబ్రజ్ అహ్మద్, శ్రీకర్ భరత్ వంటి కుర్రాళ్లకు అవకాశం కల్పిస్తారని అభిమానులు భావించినా అలా జరగలేదు. న్యూజిలాండ్ నేటి మ్యాచ్‌లో ఓ మార్పుతో బరిలో దిగుతోంది. హెన్రీ సిప్లీ స్థానంలో జాకబ్ డఫ్పీ తుది జట్టులోకి వచ్చాడు.

భారత జట్టు: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్, ఉమ్రాన్ మాలిక్ 

న్యూజిలాండ్ జట్టు: ఫిన్ ఆలెన్, డివాన్ కాన్వే, హెన్రీ నికోలస్, డార్ల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైకెల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, లూకీ ఫర్గూసన్, జాకబ్ డఫ్పీ, బ్లెయిర్ టిక్నర్

 

Last Updated Jan 24, 2023, 1:18 PM IST

Leave a Comment