IND vs NZ: A fan invaded the field and hugged Rohit Sharma during India vs New Zealand 2nd ODI

Photo of author

By Admin


రోహిత్ శర్మను పిచ్చిగా అభిమానించే ఆ కుర్రాడు.. తన ఆరాధ్య క్రికెటర్‌ను ఎలాగైన కలవాలనే ఉద్దేశంతో సాహసం చేశాడు. ఇక ఆ కుర్రాడిని వదిలేయాని రోహిత్ శర్మ సెక్యూరిటీకి సూచించడం టీవీ కెమెరాల్లో కనిపించింది. రోహిత్ శర్మ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా బ్లెయిర్ టిక్‌నెర్ వేసిన 10వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని రోహిత్ సిక్సర్ బాదగా.. అనంతరం ఆ బాలుడు మైదానంలోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు మహమ్మద్ షమీ(3/18), హార్దిక్ పాండ్యా(2/16), వాషింగ్టన్ సుందర్(2/7) విజృంభించడంతో న్యూజిలాండ్ 34.3 ఓవర్లలోనే 108 పరుగులకే కుప్పకూలింది. గ్లేన్ ఫిలిప్స్(52 బంతుల్లో 5 ఫోర్లతో 36), మైకేల్ బ్రేస్‌వెల్(30 బంతుల్లో 4 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సిరాజ్, ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌కు తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది. న్యూజిలాండ్ బ్యాటర్లు తడబడిన వికెట్‌పై భారత ఓపెనర్లు స్వేచ్చగా ఆడారు. ముఖ్యంగా రోహిత్ శర్మ తనకే సాధ్యమైన ట్రేడ్ మార్క్ షాట్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం షిప్లే బౌలింగ్‌లో రోహిత్ ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో శుభ్‌మన్ ఇన్నింగ్స్ నడపిస్తున్నాడు.

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి.

Allow Notifications

You have already subscribed

Leave a Comment