రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 109 పరుగుల టార్గెట్‌ను 20.1 ఓవర్లలోనే ఛేదించింది. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మ (51) హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు.
January 21, 2023 / 06:48 PM IST
IND vs NZ : రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 109 పరుగుల టార్గెట్‌ను 20.1 ఓవర్లలోనే ఛేదించింది. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మ (51) హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. అతను ఔటయ్యాక శుభ్‌మన్ గిల్ (40) కోహ్లీ (11), ఇషాన్ కిషన్ (8)తో కలిసి లాంఛనం పూర్తి చేశాడు. మూడు వికెట్లు తీసి కివీస్ నడ్డి విరిచిన మహమ్మద్ షమీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. అతను 6 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. రెండో వన్డేలో విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో సొంతం చేసింది. దాంతో.. టీమిండియా స్వదేశంలో వరుసగా ఏడో సిరీస్ గెలిచింది. నామమాత్రమైన మూడో వన్డే జనవరి 24న ఇండోర్‌లో జరగనుంది.
ఓపెనర్లు దంచడంతో..
స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ భారత్‌కు శుభారంభం ఇచ్చారు. హాఫ్ సెంచరీతో చెలరేగిన రోహిత్, కివీస్ మీద ఒత్తిడి పెంచాడు 7 ఫోర్లు, 2 సిక్సర్లతో అతను ఫిఫ్టీ సాధించాడు. హిట్‌మ్యాన్, గిల్ తొలి వికెట్‌కు 72 రన్స్ చేశారు. షిప్లే బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ రెండు ఫోర్లు బాదాడు. బంతిని డిఫెండ్ చేయబోయిన అతను శాట్నర్ బౌలింగ్‌లో స్టంపౌట్ కావడంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత గిల్, ఇషాన్ కిషాన్ మరో వికెట్ పడకుండా ఆడి జట్టును గెలిపించారు.
భారత పేసర్ల ధాటికి..
తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ, బ్రేస్‌వెల్ శతకంతో ఉప్పల్ స్టేడియం హోరెత్తింది. దాంతో, రాయ్‌పూర్‌లోనూ పరుగుల వరద ఖాయం అనుకున్నారంతా. కానీ, పిచ్ అనుకూలించడంతో భారత బరౌలర్లు చెలరేగారు. పవర్ ప్లేలో 4 వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బకొట్టారు. షమీ, సిరాజ్, పాండ్యా ధాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. రెండంకెల స్కోర్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. గ్లెన్ ఫిలిఫ్స్ (36), శాంటర్న్(27), బ్రేస్‌వెల్ (22) మాత్రమే రాణించారు. ఫిలిఫ్స్, బ్రేస్‌వెల్‌తో 41 రన్స్, శాంటర్న్‌తో 47 రన్స్ జోడించడంతో కివీస్ గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది.
]]]]]]>]]]]>]]>
Previous article
టీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించిన సంక్రాంతి సీజన్
Next article
Black Carrot | బ్లాక్ క్యారెట్.. వీటితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు