Rohit sharma forgot to decide after toss INDvsNZ ODI

Photo of author

By Admin

అతను అంత సేపు ఆలోచించడం చూసిన కామెంటేటర్ రవిశాస్త్రి నవ్వేశాడు. ‘రోహిత్ ఏం చేస్తున్నావ్ అక్కడ?’ అని అడిగాడు. ‘టీం మీటింగ్‌లో కూడా ముందుగా బౌలింగ్ చేయాలా? లేదంటే బ్యాటింగ్ చేయాలా? అని చర్చించుకుంటూ ఉన్నాం. అదే ఆలోచిస్తూ ఉండిపోయా. ముందు ఏం చేయాలా? అని ఆలోచిస్తూండిపోయా’ అని రోహిత్ చెప్పాడు. తమను తాము ఛాలెంజ్ చేసుకోవాలని అనుకున్నామని, హైదరాబాద్‌లో ముందుగా బ్యాటింగ్ చేసినా దాని వెనుక ఉన్న కారణం అదేనన్నాడు.

హైదరాబాద్‌లో లైట్స్ కింద బౌలింగ్ చేయాలని అనుకున్నామని, ఇక్కడ బౌలింగ్ చేయాలా? లేక బ్యాటింగ్ చేయాలా? అనే డైలమాలో ఉండిపోయానని చెప్పాడు. అయితే రెండో వన్డే కోసం జట్టులో ఎలాంటి మార్పులూ లేవని, తొలి వన్డే ఆడిన జట్టుతోనే బరిలో దిగుతున్నామని స్పష్టం చేశాడు. కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ మాట్లాడుతూ తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నామని చెప్పాడు. న్యూజిల్యాండ్ జట్టులో కూడా ఎలాంటి మార్పులూ లేవని వెల్లడించాడు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ.

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి.

Allow Notifications

You have already subscribed

Leave a Comment