Anant Ambani | అంబానీ ఇంట పెళ్లి సందడి.. వేడుకగా మెహందీ ఫంక్షన్‌.. ఫొటోలు వైరల్‌

Photo of author

By Admin


ముఖేష్‌ అంబానీ చిన్న కొడుకు త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. పెళ్లికి ముందు జరగే మెహందీ ఫంక్షన్‌లో పెళ్లి కుమార్తె రాధికా మర్చెంట్‌ అందంగా ముస్తాబైన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి

January 19, 2023 / 06:04 PM IST

Anant Ambani | రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముకేశ్‌, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మెహందీ ఫంక్షన్‌ను వేడుకగా నిర్వహించారు. ఈ వేడుకలో రాధికా మర్చెంట్‌ పింక్‌ కలర్‌ లెహంగాలో మెరిసిపోయారు. బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ పాటకు డ్యాన్స్‌ చేసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

అనంత్‌-రాధికా మర్చంట్‌ల నిశ్చితార్థం గతేడాది డిసెంబర్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని శ్రీనాథ్‌జీ ఆలయంలో ఈ వేడుకను అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా నిర్వహించారు. నిశ్చితార్థం అనంతరం ముంబయిలోని అంబానీ నివాసం ఆంటిలియాలో గ్రాండ్‌పార్టీ అరేంజ్‌ చేశారు. ఈ పార్టీకి బాలీవుడ్‌ సెలబ్రిటీలు, ఇతర రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు.

‘ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌’ సంస్థ సీఈఓ విరెన్‌ మర్చంట్‌-శైలజా మర్చంట్‌ల కుమార్తెనే రాధిక. మర్చంట్‌ కుటుంబానికి, అంబానీ కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలున్నాయి. ఇదే అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల మధ్య ప్రేమకు దారితీసింది. అంబానీ ఇంట జరిగే ప్రతి కార్యక్రమంలోనూ రాధిక పాల్గొంటూ అందరి దృష్టినీ ఆకర్షించేది. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరు చివరకు వివాహ బంధంతో ఒక్కటికాబోతున్నారు.

]]]]]]>]]]]>]]>

Previous article

Arjun Das | బుట్ట బొమ్మ మూవీ ఇంటర్వ్యూలో అర్జున్ దాస్..

Next article

ప్రజలు కోరిన చోట కంటివెలుగు శిబిరాలు: మంత్రి హరీశ్‌ రావు

Leave a Comment