Mohammed Siraj: హోం గ్రౌండ్‌లో తొలిసారి ఆడనున్న హైదరాబాదీ పేసర్.. 3 ఫార్మాట్లలో కీ ప్లేయర్ అంటూ రోహిత్ ప్రశంసలు | Hyderabadi pacer Mohammed Siraj will play for the first time at home ground says rohit sharma team india playing 11 against new zealand 1st odi

Photo of author

By Admin

India vs New Zealand 1st ODI: సిరాజ్ రెండేళ్లుగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సిరాజ్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. కొత్త బాల్‌తో క్విక్‌గా వికెట్స్ తీస్తున్నాడని, సిరాజ్‌ తప్పకుండా ఈ సిరీస్‌లోనూ రాణిస్తాడని రోహిత్ చెప్పుకొచ్చాడు.

Mohammed Siraj ind vs nz 1st odi

శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ల్లో సత్తా చాటని టీమిండియా.. రేపటి నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రేపు జరగనుంది. ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న ఇరుజట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన ఇరుజట్లు కెప్టెన్లు తమతమ బలాలు, ప్లాన్స్ పంచుకున్నారు. ముఖ్యంగా టీమిండియా సారథి రోహిత్ శర్మ కొన్ని కీలక విషయాలను పంచుకున్నాడు.

రోహిత్ మాట్లాడుతూ.. బలమైన టీంతో బరిలోకి దిగనున్నాం. మా శక్తి సామర్ధ్యాలను పరీక్షించుకోవడానికి మాకు ఇది మంచి అవకాశం. గత సిరీస్ ఆడని ఇషాన్ కిషన్‌ను ఈ సారి మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తామని ప్రకటించాడు. దీంతో ఇషాన్ కిషాన్ న్యూజిలాండ్‌తో ఆడడం ఖయమైంది.

సిరాజ్ రెండేళ్లుగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సిరాజ్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. కొత్త బాల్‌తో క్విక్‌గా వికెట్స్ తీస్తున్నాడని, సిరాజ్‌ తప్పకుండా ఈ సిరీస్‌లోనూ రాణిస్తాడని రోహిత్ చెప్పుకొచ్చాడు.

అలాగే తొలిసారి హోమ్ గ్రౌండ్‌లో ఇంటర్నేషన్ మ్యాచ్ ఆడనున్న సిరాజ్‌కి అభినందనలు అంటూ ప్లేయింగ్ 11లో సిరాజ్ స్థానాన్ని ఫైనల్ చేసేశాడు. దీంతో సిరాజ్ తన సొంత మైదానంలో రాణిస్తే.. ఇక బుమ్రా స్థానంలో తన పేరును బలంగా చాటుకోగలడని నిపుణు చెబుతున్నారు. మూడు ఫార్మెట్స్‌లో సిరాజ్ కీ ప్లేయర్ అని, వరల్డ్ కప్‌నకు సిరాజ్‌ను సిద్ధం చేస్తున్నామని రోహిత్ భవిష్యత్ ప్రణాళికలు వెల్లడించాడు.

ఆపొనెంట్ టీం ఎలా ఉన్నారో ఎక్కువ ఆలోచించకుండా మా శక్తి సామర్థ్యాలపై దృష్టిపెడతామని రోహిత్ తెలిపాడు. ఇక స్పిన్నర్ల విషయంలో కొంత అయోమయం నెలకొంది. ప్లేయింగ్ 11లో ఎవరిని ఆడిస్తారో ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. దీనికి రోహిత్ కూడా సరైన సమాధానం చెప్పలేదు. చాహల్, ఆక్సర్, షాబాద్, కూల్దీప్ అందుబాటులో ఉన్నారంటూ సందిగ్ధంలో పడేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Leave a Comment