IND vs NZ 1st ODI : న్యూజిలాండ్ (New Zealand), భారత్ (India) జట్ల మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మరికాసేపట్లో తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక వ్యక్తిగత కారణాలతో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ దూరం అయ్యారు. శ్రీలంకతో సిరీస్ కు బెంచ్ కే పరిమితం అయిన ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ గా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ గాయంతో ఈ సిరీస్ కు దూరమయ్యాడు. శార్దుల్ ఠాకూర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.
దూకుడు మీద టీమిండియా
ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన టి20, వన్డే సిరీస్ లను నెగ్గిన భారత జట్టు దూకుడు మీద ఉంది. ఇటీవలె శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్ ను భారత్ వైట్ వాష్ చేసిన సంగతి తెలిసిందే. ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్ కివీస్ ను కూడా మట్టికరిపించాలనే లక్షంతో ఉంది. అయితే శ్రీలంకతో పోలిస్తే న్యూజిలాండ్ బలంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ లో పాకిస్తాన్ ను వన్డే సిరీస్ లో ఓడించడంతో కివీస్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఈ క్రమంలో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ సమరం జరగడం సహజం
కోహ్లీ సూపర్
విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. శ్రీలంకపై మూడు మ్యాచ్ ల్లో రెండు సెంచరీలు బాది మునుపటి కోహ్లీని గుర్తు చేస్తున్నాడు. ఇక కివీస్ పై కూడా తన బ్యాట్ పవర్ ఎంటో చూపేందుకు సిద్ధమైపోయాడు. కోహ్లీతో పాటు శుబ్ మన్ గిల్ కూడా ఫామ్ లో ఉన్నాడు. ఇక బంగ్లాదేశ్ తో జరిగిన చివరి వన్డేలో డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్ మళ్లీ తుది జట్టులోకి వచ్చాడు. అయితే రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. ఆరంభాలు లభిస్తున్నా బిగ్ స్కోర్లుగా మరల్చలేకపోతున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో అతడు సెంచరీ కొడతాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ కూడా వన్డేల్లో పెద్దగా ఆడటం లేదు. అతడు కూడా వన్డేల్లో టి20 ఫామ్ ను చూపిస్తాడని అభిమానులు విశ్వాసంతో ఉన్నారు.
తుది జట్లు
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, షమీ, సిరాజ్, శార్దుల్ ఠాకూర్
న్యూజిలాండ్
టామ్ లాథమ్ (కెప్టెన్,) అలెన్, కాన్వే, నికోలస్, మిచెల్, ఫిలిప్స్, బ్రేస్ వెల్, సాన్ ట్నర్, ఫెర్గూసన్, టిక్నర్
First published:January 18, 2023, 13:07 IST
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ind vs Nz, Ind vs NZ ODI series, India vs newzealand, Mohammed Siraj, Rohit sharma, Surya Kumar Yadav, Team India, Virat kohli