Venus Transit in Pisces on 15th February 2023: These 3 zodiac signs will win the lottery.

Photo of author

By Admin

Venus Transit 2023: సంపద, కీర్తి, ఆనందం, ఐశ్వర్యం మరియు విలాసానికి కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. నూతన సంవత్సరంలో ఫిబ్రవరి 15న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్ర గ్రహం మీనరాశి ప్రవేశం కారణంగా గురు గ్రహంతో సంయోగం ఏర్పడనుంది. దీని కారణంగా కొందరికి ఆకస్మిక ధనలాభం కలుగనుంది. మీనరాశిలో శుక్ర సంచారం (Shukra Gochar 2023) వల్ల మూడు రాశులవారు విశేష ప్రయోనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

శుక్రుని సంచారం ఈ రాశులకు శుభప్రదం
మిథునం  (Gemini)– శుక్రుని సంచారం వల్ల మిధున రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ సంచారం మిథున రాశి యొక్క పదవ ఇంట్లో జరుగుతుంది. మీరు కెరీర్ లో అపారమైన పురోగతిని సాధిస్తారు. ఉద్యోగం లేదా వ్యాపారం చేసే వ్యక్తులు భారీ లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులక పదోన్నతి లభిస్తుంది. ఆదాయంలో రెట్టింపు లాభం  ఉంటుంది. పార్టనర్ షిప్ తోచేసే వ్యాపారంలో మీరు లాభాలను గడిస్తారు. మీ లవ్ సక్కెస్ అవుతుంది. 

కన్యారాశి (Virgo) – కన్యారాశిలోని సప్తమ రాశిలో శుక్రుడు సంచరించడం వల్ల మీరు అనుకూల ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా మీరు బలపడతారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించే అవకాశం ఉంది. శుక్రుని అనుగ్రహంతో ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం  ఉంది. 

తుల రాశి (Libra) – తుల రాశి వారికి శుక్రుడు ఆరవ ఇంటిలో సంచరిస్తాడు. దీంతో మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగుల జీతాలు పెరిగే అవకాశం ఉంది. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సినిమా మరియు కళలతో సంబంధం ఉన్నవారు లాభపడతారు. 

Also Read: Happy Lohri 2023: భోగి లేదా లోహ్రీని 13న జరుపుకోవాలా లేదా 14న జరుపుకోవాలా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Leave a Comment