Venus transit in Pisces on 15th Feb 2023: These zodiac signs will win the lottery.

Photo of author

By Admin

Shukra Rashi Parivartan 2023: శుక్ర గ్రహం సంపద, వైభవం, ఆనందం, ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా భావిస్తారు. శుక్రుడి సంచారం మెుత్తం 12 రాశులవారి జీవితాలను  ప్రభావితం చేస్తుంది. ఫిబ్రవరి 15న శుక్రుడు మీనరాశిలో ప్రవేశించనున్నాడు. శుక్రుని సంచారం కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. మీనరాశిలో శుక్రుని సంచారం వల్ల కొన్ని రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నారు. అదే సమయంలో మీనరాశిలో బృహస్పతి-శుక్ర సంయోగం కూడా ఏర్పడనుంది. 

శుక్రుడి సంచారం ఈ రాశులకు వరం
మిధునరాశి (Gemini): మీనరాశిలో శుక్రుని సంచారం వల్ల మిథునరాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుక్ర సంచారం మిథునరాశి వారి జాతకంలో పదో ఇంట్లో జరుగుతుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతిని సాధిస్తారు. ఉద్యోగుల మరియు వ్యాపారులు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 
కన్య రాశి (virgo): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి 15న శుక్ర సంచారం కారణంగా కన్యారాశి వారు శుభఫలితాలను పొందుతారు. మీ రాశి యెుక్క ఏడో ఇంట్లో శుక్రుని సంచారం జరగనుంది. దీంతో వీరు సానుకూల ఫలితాలను పొందుతారు. మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. 
తులారాశి (Libra): తుల రాశి వారికి శుక్ర సంచారం తులరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. శుక్రుడు ఈ రాశి యెుక్క కుండలిలో  ఆరో ఇంట్లో సంచరించబోతున్నాడు. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అపారమైన పురోగతి ఉంటుంది. అనుకోకుండా డబ్బు అందుతుంది. ఉద్యోగుల జీతం పెరిగే అవకాశం ఉంది. 

Also read: Shani Dev: ఇవాళే శని గోచారం… ఈ రాశుల లైఫ్ మారడం ఖాయం.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       

Android Link –     

Apple Link –

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Leave a Comment