Shani transit 2023: With the grace of Shani Dev, the house of these zodiac signs will be filled with money.

Photo of author

By Admin

Saturn Planet Gochar In Kumbh 2023: వేద పంచాంగం ప్రకారం, శనిదేవుడు జనవరి 17న కుంభరాశిలోకి  వెళ్లబోతున్నాడు. శనిదేవుడు త్రికోణ స్థితిలో కుంభంలోకి ప్రవేశించనున్నాడు. శని సంచారం వల్ల కొన్ని రాశులవారు డబ్బు మరియు పురోగతి సాధిస్తారు. ఆ ఆదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

ధనుస్సు రాశిచక్రం (Sagittarius): ధనుస్సు రాశి వారికి శని దేవుడి సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడు సంచరించిన వెంటనే మీకు సడే సతి నుండి విముక్తి లభిస్తుంది. శనిగ్రహం మీ జాతకంలోని మూడో ఇంట్లో సంచరిస్తాడు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. ఈ సమయంలో మీరు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు.  కళా రంగంతో సంబంధం ఉన్నవారు మీకు అద్భుతంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యసాహాసాలు పెరుగుతాయి. 
మకర రాశిచక్రం (Capricorn): శని దేవుడి రాశి మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీపై శని సడే సతి ప్రారంభం అవుతుంది. ఈ సమయం మీకు ఆర్థికంగా లాభపడతారు. కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. 

కుంభం (Aquarius): కుంభ రాశి వారికి శని సంచారం లాభదాయకంగాఉంటుంది. ఎందుకంటే ఈ రాశి శని దేవుడికి ఇష్టమైన రాశి. మరోవైపు జనవరి 17న శనిదేవుడు మొదటి దశ సాధేశతిని పూర్తి చేసి రెండో దశ ప్రారంభం కానుంది. ఈ రెండో దశలో శష్ అనే రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారు మంచి పదవిని పొందే అవకాశం ఉంది. 
మిథునం రాశిచక్రం (Gemini): శని రాశి మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శని సంక్రమించిన వెంటనే మీకు దైయా నుండి విముక్తి లభిస్తుంది. దీంతో పాటు మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మతపరమైన పనుల పట్ల మీకు ఆసక్తి  పెరుగుతుంది. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది.  ఫ్యామిలీతో బంధాలు గట్టిగా ఉంటాయి. 

Also Read: Surya Dev: సూర్య గోచారం వల్ల ఈరాశులకు గోల్డెన్ డేస్.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link –     

Apple Link –

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Leave a Comment