Shani Planet will enters in Kumbh on today 2023: The fate of these zodiac signs is going to change.

Photo of author

By Admin

Shani Gochar 2023 to 2025: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని కలియుగ న్యాయమూర్తి, కర్మదాత అని పిలుస్తారు. శని స్థానం చిన్న మార్పు వచ్చినా సరే అది ప్రజల లైఫ్ పై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. శనిదేవుడు ఇవాళ అంటే జనవరి 17 రాత్రి 8.02 గంటలకు మకరరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. శనిగ్రహ రాశి మార్పు అనేక రాశులవారి జీవితాలను మార్చేయనుంది. ముఖ్యంగా శని సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. 

శని సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేష రాశి (Aries)– శని సంచారం వల్ల మేష రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ధన సంపాదనకు కొత్త మార్గాలు ఏర్పడతాయి.  మీకు ఆకస్మిక ధన లాభం ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
వృషభం (Taurus)- శని రాశి వారికి ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటిలోనూ ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్-ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో గొప్ప విజయాలు సాధిస్తారు. మీ ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. 
మిథునం (Gemini)-  శని గమనంలో మార్పు వల్ల ఉద్యోగంలో మార్పు రావచ్చు. ఆదాయం పెరుగుతుంది. మీరు కష్టపడి పనిచేస్తే విజయం మిమ్మిల్ని వరిస్తుంది. వ్యాపారంలో రిస్క్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. 
తుల (libra)- ఈ సమయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన వారికి మేలు జరుగుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. కోరుకున్న భాగస్వామితో వివాహం జరిగే అవకాశం ఉంది. కెరీర్‌లో విజయం సాధిస్తారు.

ధనుస్సు (Sagittarius)- ఇతరులకు సేవ చేసేవారు లాభపడతారు. మీ ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. మీలో ధైర్యం మరియు శక్తి పెరుగుతాయి. బిజినెస్ లో రిస్క్ తీసుకోవడం మీరు భారీగా లాభాలను గడిస్తారు. లవ్ సక్కెస్ అయ్యే అవకాశం ఉంది.
మకర రాశి (Capricorn)- శని సంచారం మీ అనేక సమస్యలను తొలగిస్తుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీరు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. డబ్బు ఆదా చేసుకోగలుగుతారు. ఆస్తి ద్వారా లాభం ఉంటుంది.
కుంభం (Aquarius)– ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యక్తిత్వంలో మెరుగుదల ఉంటుంది. మీ యెుక్క ప్రాబల్యం  పెరుగుతుంది. పని బాగా జరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది.

Also Read: Budh Margi 2023: జనవరి 18న బుధుడు మార్గి… ఈ 3 రాశుల వారిని వరించనున్న అదృష్టం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link –     

Apple Link –

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Leave a Comment